డిగ్రీ కళాశాలలో సంవిధాన్ హత్యా దివస్
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:34 PM
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధింపు (సంవిధాన్ హత్యా దివస్)ను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిం చారు.
టెక్కలి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధింపు (సంవిధాన్ హత్యా దివస్)ను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్రం విభా గం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిం చారు. ప్రిన్సిపాల్ డాక్టర్ టి.గోవిందమ్మ మాట్లాడు తూ.. 1975లో జూన్ 25న ఎమర్జెన్సీ విధింపు, దాని పర్యవసానాలను వివరించారు. కార్యక్ర మంలో డాక్టర్ సతీష్‌కుమార్, లూక్‌పాల్, త్రినాథరావు, రామారావు, ధర్మారావు తదితరు లు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళా శాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో కృత్రిమ మేధా మిషన్ లెర్నింగ్‌పై వర్క్‌షాప్ నిర్వహిం చారు. ప్రొఫెసర్ డాక్టర్ ఎం.జయంతి రావు, అధ్యాపకులు ఎం.రవికిరణ్ రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో కవిత, హేమ రాజు, శాంతనకుమార్ తదితరులు పాల్గొ న్నారు.
పౌరస్వేచ్ఛను ఎమర్జెన్సీ హరించింది
నరసన్నపేట, జూన్ 25(ఆంధ్రజ్యోతి): జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో పౌరస్వేచ్ఛను, పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.లత అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా సంవిధాన్ హత్యా దివస్‌ను బుధవారం నిర్వహించారు. ఆ రోజుల్లో నెలలు పౌరులు పడిన ఇబ్బందులను వివరిం చారు. కార్యక్రమంలో అధ్యాపకుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.