Share News

వేతన బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:52 PM

రిమ్స్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఏప్రిల్‌ నుంచి ఇవ్వాల్సిన వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఫెడరేషన్‌ నాయకుడు బి.మురళి, నగర కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు కోరారు.

వేతన బకాయిలు చెల్లించాలి
నిరసన తెలుపుతున్న సెక్యూరిటీ కార్మికులు

శ్రీకాకుళం రిమ్స్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రిమ్స్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఏప్రిల్‌ నుంచి ఇవ్వాల్సిన వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఫెడరేషన్‌ నాయకుడు బి.మురళి, నగర కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) వద్ద కార్మికులు ఖాళీ కంచా లను పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా నేతలు మాట్లా డుతూ.. వేతనాలను చెల్లించాల్సిన కాంట్రా క్టర్లు నిర్లక్ష్యం వహిస్తుం డగా ఆసుపత్రి అధికా రులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిం చడం సరికాదన్నారు. చాలీచాలని వేతనా లతో కుటుంబాలను నెట్టు కొస్తున్నారని, ఈ దిశలో ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేయించు కోవడంలో అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు కాని కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల విషయంలో బాధ్యత తీసుకోకపోవడం బాధా కరమన్నారు. జిల్లా అధికారులు స్పందించి తక్షణం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డా.సి. అమూల్యకు అందజేశారు. కార్యక్రమంలో రిమ్స్‌ యూనియన్‌ నాయకులు టి.రామారావు, ఎం.సూర్యనారాయణ, కె.రవి, సంతోషి, సావిత్రి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:52 PM