Share News

ఒడియా విద్యా వలంటీర్ల జీతాలు విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:10 AM

ఒడియా విద్యా వలంటీర్ల జీతాలు విడుదల చేయాలని ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ సురమ పాడిని కోరారు. ఈ మేరకు సోమవారం ఒడియా లింగ్విస్టిక్‌ మైనార్టీ సంఘం అధ్య క్షుడు సత్యనారాయణ పాడి భవనేశ్వర్‌లోని స్పీకర్‌ ప్రభుత్వ నివాస కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందిం చారు.

ఒడియా విద్యా వలంటీర్ల జీతాలు విడుదల చేయాలి
స్పీకర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఒడియా సంఘ నేతలు

కవిటి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఒడియా విద్యా వలంటీర్ల జీతాలు విడుదల చేయాలని ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ సురమ పాడిని కోరారు. ఈ మేరకు సోమవారం ఒడియా లింగ్విస్టిక్‌ మైనార్టీ సంఘం అధ్య క్షుడు సత్యనారాయణ పాడి భవనేశ్వర్‌లోని స్పీకర్‌ ప్రభుత్వ నివాస కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందిం చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా భాషాభివృద్ధికి వివిధ ఒడిశా పాఠశాలల్లో ఒడి శా ప్రభుత్వం నియమించిన విద్యా వలంటీర్లకు గత విద్యా సంవత్సరం జీతాలు చెల్లించలేదని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యా వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంద్ర ఒడియా పాఠశాలల డీఐ దుర్గాప్రసాద్‌ చౌదరి, ఇచ్ఛాపురం బాపూజీ పాఠాగర్‌ అధ్యక్షుడు రఘునాథ్‌ గౌడ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:10 AM