Share News

Fish: మార్కెట్‌లోకి దెయ్యం చేప

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:59 PM

Sakkermouth Catfish ఇతర జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాపించిందన్న వదంతుల కారణంగా కోడి మాంసానికి గిరాకీ తగ్గిపోయింది. చేపల విక్రయాలకు డిమాండ్‌ పెరిగింది. సమద్ర చేపలు, మంచినీటి చేపలు, రొయ్యల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

Fish: మార్కెట్‌లోకి దెయ్యం చేప
బలగమెట్టు వద్ద విక్రయానికి ఉంచిన దెయ్యం చేప (సక్కర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌)

  • అసలు పేరు ‘సక్కర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌’

  • ఇది తింటే అనారోగ్యమే

  • శ్రీకాకుళం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఇతర జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాపించిందన్న వదంతుల కారణంగా కోడి మాంసానికి గిరాకీ తగ్గిపోయింది. చేపల విక్రయాలకు డిమాండ్‌ పెరిగింది. సమద్ర చేపలు, మంచినీటి చేపలు, రొయ్యల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటితోపాటు కొంతమంది మార్కెట్‌లో కొంతమంది విషపూరితమైన ‘దెయ్యం చేప’ను కూడా విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం నగరం బలగమెట్టు వద్ద ఆదివారం బయట ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు రోడ్డుపై ఇతర చేపలతోపాటుగా ఈ చేపను కూడా విక్రయానికి ఉంచాడు. ధర కేవలం రూ.50 మాత్రమేనని, తింటే రుచిగా ఉంటుందని చెప్పారు. కానీ, దీనిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు.

  • ఈ చేప పేరు ‘సక్కర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌’. దీన్ని ప్లెకో అని కూడా పిలుస్తారు. వాడుక భాషలో దెయ్యం చేప అని అంటారు. ఇది సాధారణంగా అక్వేరియంలో పెంచుకునే చేప. ఇది దక్షిణ అమెరికాలో నదులకు చెందినది. సాధారణంగా ఈ చేపను ఆహారంగా తినేందుకు సిఫారసు చేయరు. చప్పగా ఉంటుంది. చేపలో చిన్న ఎముకలు ఉంటాయి. ఇవి ఇతర మంచినీటి చేపల జాతులకు హాని కలిగిస్తాయి. ఇది పర్యావరణానికి కూడా మంచిది కాదు. ఈ చేపలు నీటిలో ఉండే కాలుష్య కారకాలను పీల్చుకుంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే అంతటా నాటు మార్పులు అంటూ ఇసుక అతికించి క్యాట్‌ఫిష్‌లను మార్కెట్‌లో తెగ విక్రయిస్తున్నారు. ఇవి కూడా అనారోగ్యమే. ఇటువంటి చేపల విక్రయాలపై నిషేధం విధించేలా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Mar 16 , 2025 | 11:59 PM