Share News

దేవీ ఆశ్రమంలో సహస్ర కలశాభిషేకం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:39 PM

కుంచాలకురమయ్యపేట దేవీ ఆశ్రమంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరి దేవికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

దేవీ ఆశ్రమంలో సహస్ర కలశాభిషేకం
రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుంటున్న శ్రీరామానంద భారతి స్వామి

ఎచ్చెర్ల, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కుంచాలకురమయ్యపేట దేవీ ఆశ్రమంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరి దేవికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. శ్రీరామానందభారతి స్వామి దేవీ ఆశ్రమా న్ని సందర్శించి అభిషేకం, పూజలను చేపట్టారు. ఉదయం 6.30 నుంచి 10 గంటల వరకు పీఠాధిపతి తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ చక్రాల వద్ద భక్తులు సామూ హిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో అరసవల్లి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ, రుత్వికులు పాల్గొన్నారు.

ఘనంగా భరతమాత ఆలయ వార్షికోత్సవం

కవిటి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కపాసుకుద్ది భారతమాత ఆల య వార్షికోత్సవం శుక్ర వారం ఘనంగా నిర్వ హించారు. అమ్మ వారికి అభిషేకాలు చేసి ప్రత్యే కంగా అలంకరించి పూజ లు చేశారు. భారత మాత యువతన సంఘం ఆధ్వర్యంలో నిరంజన్‌ స్వామి ఆధ్వర్యంలో 108 మంది మహిళలు కుంకుమ పూజలు చేపట్టారు. మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్‌ శాస్త్రీయ సంగీత కచేరీ నిర్వహించారు.

Updated Date - Aug 22 , 2025 | 11:39 PM