ప్రతి ఇంటికీ సురక్షిత నీరు
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:52 PM
పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు చేరేలా ప్రణాళిక తయారు చేసినట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
హిరమండలం, సెప్టెంబరు13(ఆంధ్రజ్యోతి): పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు చేరేలా ప్రణాళిక తయారు చేసినట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఉద్దానం ప్రాజెక్టు-ఫేజ్ 2లో భాగంగా సుభలయ గ్రామం వద్ద 18 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. నియోజకవర్గం ప్రజలకు శుద్ధజాలలు అందించేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ మాట్లాడుతూ.. హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట మండలాల్లోని 204 గ్రామాలకు శుద్ధ జలం అందించేందుకు రూ.253 కోట్లతో 18ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పి.బుచ్చిబాబు, సర్పంచ్ లంక రోజారాణి, ఎంపీటీసీ చింతాడ బుడ్డు, పీఏసీఎస్ అధ్యక్షుడు గోళ్ల సింహాచలం, మండల ప్రత్యేక ఆహ్వానితులు తూలుగు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.