Share News

దివ్యాంగుల ‘సదరం’ పాట్లు

ABN , Publish Date - May 28 , 2025 | 11:53 PM

స్ధానిక ఏరియా ఆసుపత్రిలో సదరం ధ్రువీకరణ పత్రాలు పునః పరిశీలనకు వచ్చిన దివ్యాం గులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దివ్యాంగుల ‘సదరం’ పాట్లు
సదరంలో ధ్రువీకరణ కోసం పడిగాపులు కాస్తున్న సారవకోట మండల దివ్యాంగులు

డిజిటల్‌ అసిస్టెంట్‌ రాకపోవడంతో ఇబ్బందులు

నరసన్నపేట, మే 28(ఆంధ్రప్రదేశ్‌): స్ధానిక ఏరియా ఆసుపత్రిలో సదరం ధ్రువీకరణ పత్రాలు పునః పరిశీలనకు వచ్చిన దివ్యాం గులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధ వారం సారవకోట మండల దివ్యాంగులు సదరం శిబిరానికి హాజరయ్యారు. అంగవైకల్యం పరీక్షించే ఆర్థోపెడిక్‌ వైద్యులు హాజరైనప్పటికీ డిజిటల్‌ అసిస్టెంట్‌ రాకపోవడంతో దివ్యాంగులు మధ్యాహ్నం 2 గంటలు వరకు నిరీక్షించారు. వర్షంలో ఇబ్బందులు పడుతూ వచ్చిన దివ్యాంగులు ఇక్కడ కూడా ఎక్కువ సమయం వేచి ఉండేందుకు అవ స్థలు పడ్డారు. ఈ విషయాన్ని ఆర్థోపెడిక్‌ యశస్విని ఉన్నతాధికారులకు సమాచారమి చ్చారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ గైర్హాజరుపై ఆరా తీయగా పోలాకి మండలానికి చెందిన దివ్యాంగుల పరిశీలన పూర్తి కావడంతో ఎంపీడీవో రవికుమార్‌ ఆదేశాలతో సచివాలయంలో విధులకు హాజరైనట్లు తెలిసింది. మధ్యా హ్నం మరో డిజిటల్‌ అసిస్టెంట్‌ను కేటాయిం చగా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.

Updated Date - May 30 , 2025 | 03:05 PM