ఎరువుల కోసం పడిగాపులు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:38 PM
ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు యూరి యా కొరత లేదని పదేపదే చెబుతున్నా.. రైతులు మాత్రం ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు తప్పడం లేదు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు యూరి యా కొరత లేదని పదేపదే చెబుతున్నా.. రైతులు మాత్రం ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు తప్పడం లేదు. మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఎ రువుల దుకాణం వద్ద ఆదివారం యూరియా కో సం వేకుజాము నుంచే వందలాది మంది రైతులు క్యూకట్టారు. దుకాణదారులు ఉదయం 10 గంటల కు షాపుతెరిచి పోలీసుల సాయంతో ముందున్న 70మందికి యూరియా అందించారు. అలాగే సో మవారం ఉదయం మన గ్రోమోర్ షాపు వద్ద యూరియా అందజేస్తారని పలువురు చెప్పడంతో మిగిలిన రైతులు అక్కడికి వెళ్లి టోకెన్లు ఇవ్వాలని షాపు యజమానిని కోరారు. యూరియా వస్తుందో లేదో తమకు తెలియదని, వచ్చినప్పుడే టోకెన్లు ఇస్తానని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.