Share News

సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:06 AM

సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకే పల్లెనిద్ర నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శంకర్‌

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకే పల్లెనిద్ర నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. బుధవారం రాత్రి నగరంలోని సీపన్నాయుడుపేట కమ్యూనిటీ హాల్‌లో ఆయన పల్లెనిద్ర చేశారు. అనంతరం గురువారం ఉదయం సీపన్నాయుడుపేట, ఫాజుల్‌బాగ్‌పేట ప్రాంతాల్లోని అన్ని వీధుల్లో పర్యటించి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అన్నివీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలపై దృష్టి సారించి స మస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. వీటికి సం బంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశామని, పనులు త్వరలోనే ప్రాంభింస్తామని తెలిపారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ గణపతిరావు, రెవెన్యూ సిబ్బంది, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులంతా సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. నగరం లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమీక్షించారు. రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందజేయాలని, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో ఎరువులు, పురుగు మందులను రైతులకు అందించాలన్నారు. అలాగే నగరంలోని టౌన్‌హాలు రోడ్డులో, డే అండ్‌ నైట్‌ జంక్షన్‌, మునిసిపల్‌ కార్యాలయం వెనుక వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Updated Date - Apr 18 , 2025 | 12:06 AM