Share News

కూటమి ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:23 AM

కూటమి ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి బాట పట్టాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కేదారిపురం గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మంలో పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే పల్లెల అభివృద్ధి
కేదారిపురంలో కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

పలాస రూరల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి బాట పట్టాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కేదారిపురం గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిం చారు. గత ప్రభుత్వంలో పల్లెల్లో కనీసం రోడ్లు కూడా వేయలేక పోయారని, తమ ప్రభుత్వం పల్లెల రహదారులకు మహర్దశ కల్పించిందని తెలిపారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవతో రైతన్నలను ఆదుకుం టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ, పీరుకట్ల విఠల్‌, మల్లా శ్రీనివాసరావు, గంగారామ్‌, మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి ప్రజాదరణ

కాశీబుగ్గ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చడం వల్ల ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రజాధరణ పొందుతోందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు అన్నారు. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల పదో వార్డులో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సవర రాంబాబు, గంధం కామేశ్వర రావు, కొండే నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం

శ్రీకాకుళం రూరల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుపరిపాలన టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్‌ మండలం కల్లేపల్లి, పెద్దగనగళ్లవానిపేట గ్రామాల్లో ‘సుపరి పాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. ప్రజలే నా బలం, బలగమని నేను అందరివాడినన్నారు. కార్యక్రమంలో టీడీపీనాయకులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. పెద్ద గనగళ్లపేటలో జెమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సర్పంచ్‌ బర్రి రామారావు, ఎంపీటీసీ చీకటి అమ్మోజీరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీది మంచి పాలన

మెళియాపుట్టి, జూలై 23 (ఆంధ్ర జ్యోతి): టీడీపీది మంచి పాలన అని.. వైసీపీది విధ్వంస పాలన అని టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు కలమట వెంకట రమణమూర్తి తెలిపారు. బుధవారం మారడికోటలో సుపరి పాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ గౌడో, కోదండ, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:23 AM