Share News

ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:03 AM

ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలని, సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశించారు.

ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి
శ్రీకూర్మం రైతు సేవా కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుత్ను జేసీ

గార, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలని, సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశించారు. బుధ వారం సాయంత్రం శ్రీకూర్మంలో ఎరువుల పంపిణీపై రైతులతో మాట్లాడారు. తర్వాత శ్రీకూ ర్మంలో రెండు రైతు సేవా కేంద్రాలు, శ్రీకూర్మరం జంక్షన్‌, గారలో ఉన్న రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సంబం ధిత సిబ్బంది అందుబాటులో ఉండాలని, రైతులకు ఇబ్బందులు కలుగ కుండా చూడాలని కస్టోడియన్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో తహ సీల్దార్‌ ఎం.చక్రవర్తి, వ్యవసాయాధికారి దుంపల పద్మావతి, ఏఈవో బడగల దుర్గా ప్రసాద్‌, ఆర్‌ఐ రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:03 AM