Share News

పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:37 PM

RTC special buses కార్తీకమాసం వేళ.. పంచారామ క్షేత్రాలను భక్తులు సందర్శించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

అరసవల్లి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం వేళ.. పంచారామ క్షేత్రాలను భక్తులు సందర్శించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాష్ట్రంలోని అమరావతి(అమరారామం), భీమవరం(భీమారామం), పాలకొల్లు(క్షీరారామం), ద్రాక్షారామం, సామర్లకోట(కుమారారామం) క్షేత్రాలకు ఈ బస్సులు నడుపుతాం. ఈ నెల 26, నవంబరు 2, 9, 16వ తేదీల్లో పలాస, టెక్కలి, శ్రీకాకుళం డిపోల నుంచి సాయంత్రం 4 గంటలకు బస్సులు బయలుదేరతాయి. వీటికి ముందస్తుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌.ఇన్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. పూర్తిగా బుక్‌ చేసుకున్నవారికి ఇంటివద్దకే బస్సు వస్తుంది. ఒక మనిషికి శ్రీకాకుళం నుంచి సూపర్‌ లగ్జరీ రూ.2400, అలా్ట్ర డీలక్స్‌ రూ.2,350 చార్జీలుగా నిర్ణయించాం. అలాగే విశాఖదర్శిని, అరకు దర్శిని, శైవక్షేత్రాలను దర్శించుకునేందుకు, పిక్నిక్‌ స్పాట్‌లకు వెళ్లేందుకు అద్దె ప్రాతిపదికన బస్సులు కేటాయిస్తాం. మరిన్ని వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611 నెంబర్లను సంప్రదించాల’ని అప్పలనారాయణ కోరారు.

Updated Date - Oct 10 , 2025 | 11:37 PM