వరదనీటిలో నిలిచిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:45 PM
floodwaters వర్షం పడితే రైల్వే అండర్‌పాసేజ్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం పొందూరు మండలం బొడ్డే పల్లి సమీపంలోని అండర్‌పాసేజీ బ్రిడ్జి వద్ద 8 అడుగులమేర వరదనీటిలో ఆర్టీసీ బస్సు నిలి చిపోయింది.
పొందూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): వర్షం పడితే రైల్వే అండర్‌పాసేజ్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం పొందూరు మండలం బొడ్డే పల్లి సమీపంలోని అండర్‌పాసేజీ బ్రిడ్జి వద్ద 8 అడుగులమేర వరదనీటిలో ఆర్టీసీ బస్సు నిలి చిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్థానికులు సహాయక చర్యలు చేప ట్టారు. బస్సును ఎక్స్‌కవేటర్ సాయంతో వరదనీటి నుంచి బయటకు తీశారు. బ్రిడ్జిలో వరద నీరు నిలిచిపోవడంతో ఇరువైపులా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పటి కప్పుడు వరదనీటి కారణంగా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ప్రత్యామ్నాయం చూపాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.