క్యాబ్, కారుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:24 AM
మెట్ట వలస కూడలి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పల్టీలు కొట్టి దుకాణంలోకి వెళ్లిన వాహనం
తప్పిన పెను ప్రమాదం
జి.సిగడాం, ఆగ స్టు 17(ఆంధ్ర జ్యోతి): మెట్ట వలస కూడలి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ వెళ్లేందుకు ప్రయాణికులను ఎక్కించేందుకు ఆగి ఉన్న మ్యాక్స్ క్యాబ్‌ను రా జాం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొనడంతో పాటు చిలకపాలెం నుంచి ఎదురుగా వస్తున్న కారును కూడా ఢీకొట్టింది. దీంతో క్యాబ్ రెండు మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పా న్‌షాపులోకి దూసుకుపోయింది. ఆ సమయం లో షాపులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విష యం తెలుసుకున్న ఎస్‌ఐ వై.మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీ లించారు. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న క్యాబ్‌ను, అలాగే ఎదురు గా వస్తున్న కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. క్యాబ్ డ్రైవర్ కడగల రామినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ బలగ వినోద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ప్రమాదంలో కడగల రామినాయుడుకు స్వల్ప గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం రాజాంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.