ఆర్టీసీ ఆస్తులు కార్పొరేట్లకు ధారాదత్తం చేయొద్దు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:18 PM
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే సహించేది లేదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) జోనల్ కార్యదర్శి బి.కృష్ణమూర్తి స్పష్టం చేశారు.
ఆర్టీసీ ఈయూ జోనల్ కార్యదర్శి బి.కృష్ణమూర్తి
అరసవల్లి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే సహించేది లేదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) జోనల్ కార్యదర్శి బి.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. శనివారం స్థానిక సంఘ కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. విజయవాడ నడి బొడ్డున ఉన్న సుమారు రూ.400 కోట్ల విలువైన ఆస్తు లను కార్పొరేట్లకు ఇచ్చేందుకు ప్రయత్ని స్తుండడం దారుణమన్నారు. దశాబ్దాలుగా ప్రజలకు 200 బస్సులతో రవాణా సదుపాయం కల్పిస్తున్న 1100 మంది ఉద్యో గులను ప్రజలకు దూరం చేసే ప్రక్రియను విరమించుకోవాలని డిమాం డ్ చేశారు. తక్షణం లూలూ మాల్‌కు కేటాయించిన జీవో నెం. 137ను రద్దు చేయాలని కోరారు. లులూ షాపింగ్ మాల్‌ను నగర శివార్లలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందు తుందన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే నిర్ణ యాలను వెనక్కు తీసుకోవాలని లేకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్ర మంలో సంఘం జిల్లా కార్యదర్శి దశరధుడు, కోశాధికారి పీవీ ఆర్ లలితకుమారి, వన్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు జీవీమూర్తి, ఎస్‌వీరమణ, టు డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఆర్ కృష్ణ, కె. బాబూరావు, టెక్కలి, పలాస డిపో నాయకులు కేవీరావు, ఎస్‌ఎం.రావు, ఎంఏరాజు, ఏడీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.