‘స్త్రీశక్తి’తో రూ.51కోట్ల భారం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:45 PM
స్త్రీశక్తి పథకం వల్ల నెలకు రూ.51కోట్ల భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచాలని కోరారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ డిపోను ఈడీ పరిశీలించారు.
టెక్కలి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పథకం వల్ల నెలకు రూ.51కోట్ల భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచాలని కోరారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ డిపోను ఈడీ పరిశీలించారు. అనంతరం సిబ్బం దితో డిపోకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు జిల్లాల్లో 19 డిపోలకు గాను 1,610 బస్సులు ఉన్నాయని, ఇందులో 1,332 బస్సులు స్త్రీశక్తి పథకానికి వినియోగిస్తున్నావని తెలిపారు. ఆగస్టు 14న 4లక్షల 16వేలు మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగిం చుకోగా, గతనెలర29న 8లక్షల39వేల మంది మహిళలు వినియోగించుకున్నారని చెప్పారు. ఆర్టీసీ పరిధిలో పలు అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయనతో పాటు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, డీఈఈ రవికు మార్, డిపో మేనే జర్ శ్రీనివాసరావులు ఉన్నారు.