రూ.4.20 లక్షలు స్వాహా
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:43 PM
ధనుపురం పోస్టాఫీసులో ఖాతాదారుల సొ మ్ము స్వాహాపై విచారణ కొనసాగుతోంది. ఈ పోస్టాఫీసు పరిధిలోని ధనుపురం, తంప, మాళువ, నౌతల తదితర గ్రామాలకు చెందిన సుమారు 2 వందల మంది ఖాతాదారులున్నారు.
హిరమండలం, జూన్ 24(ఆంధ్రజ్యోతి): ధనుపురం పోస్టాఫీసులో ఖాతాదారుల సొ మ్ము స్వాహాపై విచారణ కొనసాగుతోంది. ఈ పోస్టాఫీసు పరిధిలోని ధనుపురం, తంప, మాళువ, నౌతల తదితర గ్రామాలకు చెందిన సుమారు 2 వందల మంది ఖాతాదారులు న్నారు. ఖాతాదారులు ఎఫ్‌డీలు, ఆర్డీలు, జనని సురక్ష యోజన తదితర పథకాలకు నగదు జమ చేస్తున్నారు. వీటి నిర్దేశిత కాలం అవడం తో సదరు మొత్తాలు చెల్లించాలని ఇటీవల కోరడం, ఈ నిధులను బీపీఎం సొంత అవస రాలకు వినియోగించుకున్న విషయం బయట పడింది. దీంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా టెక్కలి అసిస్టెంట్ సూపరింటెం డెంట్ ప్రతాప్ విచారణ కొనసాగిస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.4.20 లక్షల నగ దును బీపీఎం సొంత అవసరాలుకు వినియో గించినట్లు గుర్తించామన్నారు. ఇంకా మిగిలిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నామని, ఖా తాలు లేని వారి వద్ద నుంచి స్వాహా చేసిన నగదు ఎక్కువగా ఉంటుందని, పూర్తి దర్యాప్తు అనంతరం ఎంత సొమ్ము పక్కదారి పట్టింద నేది తెలుస్తుందని ఆయన తెలిపారు. ఈ పోస్టాఫీసులో బీపీఎంగా ఆమె 13 ఏళ్లుగా పని చేస్తోంది. ఖాతాదారులు తమ పాస్ పుస్తకా లను ఆమె వద్దే ఉంచేవారు. ఇదే అదునుగా ఖాతాదారులు జమ చేసిన మొత్తాలను తన సొంతానికి వినియోగించు కుందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఎంత మొత్తం అక్ర మాలకు పాల్పడిందీ విచారణ చేపట్టి బాధ్యు రాలిపై చర్యలు తీసుకోవాలని బాధి తులు కోరుతున్నారు.