ఉప్పుటేరు వంతెనకు రూ.4 కోట్లు
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:37 PM
ఉప్పలాం, సిరిమామిడి పంచాయతీల పరిధిలో ఎర్రముక్కాం-ఎకువూరు గ్రామాల మధ్య ఉప్పుటేరుపై రోడ్డు, వంతెన పనులు పూర్తి చేసేందుకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి.
సోంపేట రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉప్పలాం, సిరిమామిడి పంచాయతీల పరిధిలో ఎర్రముక్కాం- ఎకువూరు గ్రామాల మధ్య ఉప్పుటేరుపై రోడ్డు, వంతెన పనులు పూర్తి చేసేందుకు ఎట్టకేలకు నిధులు మంజూ రయ్యాయి. 2007లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లో నాబార్డు నిధులు మంజూరు కాగా పను లు ప్రారంభించి ఆ తరువాత ప్రభుత్వం మారడంతో అర్ధంతరంగా నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం రాకతో మరలా ఆశలు చిగురించాయి. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించినా ఆ తరువాత పనులు ముందుకు సాగలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో అనేక పర్యాయాలు కథనా లు రావడం, ఎమెల్యే బెందాళం అశోక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్ర మోహన్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దృష్టికి తీసుకు వెళ్లారు. వంతెన ప్రాధాన్యం వివ రించారు. దీంతో ఆయన స్పందించి ఉపాధి హామీ నిధుల నుంచి రూ.4 కోట్లు మంజూరు చేశారు. వంతెన పనులకు ఉపాధి నిధులు మం జూరయ్యాయని, పనులు వెంటనే పునః ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ పీఐయూ డీఈఈ రవికుమార్ తెలిపారు. దీంతో పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేసి కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.