Share News

ఉద్దానం-2 ప్రాజెక్టుకు రూ.265 కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:41 PM

పాతపట్నం నియోజకవర్గ ప్రజల కు తాగునీరందించేందుకు గాను ఉద్దానం ప్రాజెక్టు-2 పూర్తి చేసేందుకు రూ.265 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అమరావతిలో మంగళ వారం కలిసి వినతిపత్రం అందించారు.

ఉద్దానం-2 ప్రాజెక్టుకు రూ.265 కోట్లు కేటాయించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

సీఎం చంద్రబాబును కోరిన ఎంజీఆర్‌

శ్రీకాకుళం, జూలై 22(ఆంధ్రజ్యోతి): పాతపట్నం నియోజకవర్గ ప్రజల కు తాగునీరందించేందుకు గాను ఉద్దానం ప్రాజెక్టు-2 పూర్తి చేసేందుకు రూ.265 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అమరావతిలో మంగళ వారం కలిసి వినతిపత్రం అందించారు. పాతపట్నం నియోజకవర్గ సమ స్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గొట్టా బ్యారేజీ ఏప్రాన్‌ నిర్మాణం చేపట్టాలని, అంబావిల్లి వంతెనకు నిధులివ్వాలని, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పలువురికి సహకారం కావాలని విన్నవించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

Updated Date - Jul 22 , 2025 | 11:41 PM