పీఎంశ్రీ పాఠశాలలకు రూ.25వేలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:52 PM
పీఎంశ్రీ పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నరసన్నపేట, జూలై 30(ఆంధ్రజ్యోతి): పీఎంశ్రీ పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరు 5న జిల్లాలో 17 పీఎంశ్రీ పాఠశాలలను ప్రారంభించింది. ఈ పాఠశాలల్లో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు ప్రభుత్వం రూ.25వేల చొప్పున నిధులను మంజూరు చేసింది. జాతీయ జెండా, సౌండ్ సిస్టంకు రూ.5వేలు, విద్యార్థుల ఆటల పోటీల నిర్వహణకు రూ.5వేలు, చారిత్రక ఘటనలపై స్కిట్ల ప్రదర్శనకు రూ.3వేలు, వ్యాసరచన, క్విజ్, పెయింటింగ్ పోటీలకు రూ.5వేలు, పోస్టర్ తయారీ, సామగ్రి, బహమతులు, స్వీట్లు ఇతర ఖర్చులకు రూ.7వేలు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.