‘వంశధార’ కాలువకు రూ.1600 కోట్లు అవసరం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:14 AM
‘వంశధార ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా గత 50 ఏళ్లుగా దాదాపు 1.50లక్షల ఎకరాలకు సా గునీరు అందిస్తున్నాం. ప్రస్తుతం కాలువ దీనస్థితిలో ఉంది. 2,400 క్యూ సెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా.. 1800 క్యూసెక్కులు కూడా వెళ్ల డం లేదు.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ రాంగోపాల్
హిరమండలం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘వంశధార ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా గత 50 ఏళ్లుగా దాదాపు 1.50లక్షల ఎకరాలకు సా గునీరు అందిస్తున్నాం. ప్రస్తుతం కాలువ దీనస్థితిలో ఉంది. 2,400 క్యూ సెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా.. 1800 క్యూసెక్కులు కూడా వెళ్ల డం లేదు. కచ్చితంగా ఆధునికీకరించాల్సి ఉంది. దీనికోసం రూ.1600 కోట్లు అవసరం. అంచనాలు తయారు చేశాం. ప్రభుత్వానికి అందజేసే ముందు క్షేత్ర స్థాయిలో కాలువ స్థితిగతులు పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామ’ని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ డి.రాంగోపాల్ చెప్పారు. బుధవా రం హిరమండలం వద్ద వంశధార రిజర్వా యర్ పనులు, లిఫ్ట్ ఇరిగేషన్, మరమ్మ తులకు గురైన గొట్టాబ్యారేజీ దిగువ ప్రాం తాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం రాతికట్టుతో నిర్మించిన గొట్టాబ్యారేజి ఎడమ కాలు వకు కాంక్రీ ట్‌తో మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. 14ఏళ్ల క్రితం షట్టర్ల కుంభ కో ణం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. నాలుగైదు రోజుల్లో అప్పటి అధికారులను పిలిపించి... సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారని చెప్పారు. గొట్టాబ్యారేజి దిగువ భాగంలో రక్షణ గోడలు బాగా దెబ్బతిన్నాయన్నారు. దీని కోసం రూ.12.50 కోట్లు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. వంశధార రిజర్వాయర్ 87, 88 ప్యాకేజి పనులు 90 శాతం పూర్తయ్యాయని సీఈ రాంగోపాల్ చెప్పారు. ఆయనతోపాటు ఎస్‌ఈ పీవీ తిరుపతి రావు, డీసీఈ బి.శ్రీహరి, డీఈఈలు ఎంవీ సురేష్, ఆర్.రామకృష్ణ ఉన్నారు.