Share News

గ్రామీణ రోడ్లకు రూ.100 కోట్లు

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:04 AM

జిల్లాలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టింది. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

గ్రామీణ రోడ్లకు రూ.100 కోట్లు

67 రహదారుల పనులకు అనుమతి

నిధులు కేటాయించిన ప్రభుత్వం

శ్రీకాకుళం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టింది. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ర్టెంథనింగ్‌ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ-ఫేజ్‌ 1)కింద జిల్లావ్యాప్తంగా మొత్తం 67 రహదారుల పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాలో గ్రామీణ రవాణా వ్యవస్థ మెరుగుపడనుందని.. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ వీరన్నాయుడు తెలిపారు.

  • మంజూరైన పనులు : 67

  • రోడ్ల పొడవు : 213.12 కిలోమీటర్లు

  • కేటాయించిన బడ్జెట్‌ : రూ. 100.28 కోట్లు

ఆమదాలవలస నియోజకవర్గం

  • పొందూరు : కింతలి బొడ్డేపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి ఎన్‌హెచ్‌-16 వరకు(సింగూరు మీదుగా) రూ.2.70 కోట్లు. పెనుబర్తి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తోలాపి వరకు రూ.1.73 కోట్లు.

  • ఆమదాలవలస : కలపర్తి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బొబ్బిలిపేట వరకు రూ. 2.16 కోట్లు

  • బూర్జ : సీఎస్‌పీ రోడ్డు నుంచి బొమ్మిక వరకు రూ. 1.48 కోట్లు.

ఎచ్చెర్ల నియోజకవర్గం

  • రణస్థలం : ఎన్‌హెచ్‌-16 నుంచి పాతర్లపల్లి పోతయ్యపేట వరకు రూ. 2.77 కోట్లు.

  • ఎచ్చెర్ల: తోటపాలెం నుంచి మత్స్యలేశం వరకు (ముద్దాడ రామోజీపేట మీదుగా) రూ. 3.10 కోట్లు. పొన్నాడ నుంచి కమ్మపేట వరకు రూ. 2.13 కోట్లు.

  • లావేరు : పాతఎన్‌హెచ్‌-5 నుంచి కృష్ణాపురం వరకు రూ. 1.43 కోట్లు.

  • జి.సిగడాం : పొగిరి ఆర్‌అండ్‌బీ జంక్షన్‌ నుంచి వీపీ రోడ్డు వరకు రూ. 1.58 కోట్లు.

ఇచ్ఛాపురం నియోజకవర్గం

  • సోంపేట : బారువ రోడ్డు నుంచి రామయ్యపట్నం వరకు రూ.2.09 కోట్లు. పాత ఎన్‌హెచ్‌-5 రోడ్డు నుంచి మండల బోర్డర్‌ వరకు రూ. 2.36 కోట్లు.

  • కవిటి : ఎన్‌హెచ్‌ 16 నుంచి శిలగాం వరకు రూ. 1.19 కోట్లు.

  • ఇచ్ఛాపురం : ఐబీ రోడ్డు నుంచి బొడ్డకలి వరకు రూ. 1.14 కోట్లు.

నరసన్నపేట నియోజకవర్గం

  • జలుమూరు : ఎన్‌హెచ్‌-326ఏ నుంచి పెద్దదూగం వరకు రూ. 1.53 కోట్లు. గొటివాడ నుంచి సైరిగాం వరకు రూ. 1.68 కోట్లు.

  • నరసన్నపేట : తోటాడ నుంచి సుందరాపురం వరకు రూ. 1.39 కోట్లు.

  • సారవకోట : డీఎల్‌ పురం నుంచి పనసలోవ వరకు రూ. 1.91 కోట్లు.

పలాస నియోజకవర్గం

  • మందస: పాతఎన్‌హెచ్‌ 5 నుంచి గండ్రుగాం జంక్షన్‌ వరకు (బలియాగాం మీదుగా) సుమారు 10.5 కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డు నిర్మాణానికి అత్యధికంగా రూ. 5.72 కోట్లు కేటాయించారు. అలాగే మందస-హరిపురం రోడ్డు నుంచి దిమిరియా వరకు రూ. 3 కోట్లు కేటాయించారు.

  • వజ్రపుకొత్తూరు : చినరాజం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బట్టుపురం వరకు రూ. 2.23 కోట్లు.

పాతపట్నం నియోజకవర్గం

  • పాతపట్నం : గంగువాడ నుంచి చినమల్లిపురం వరకు రూ. 3.12 కోట్లు. పీటీ రోడ్డు నుంచి బడ్డుమర్రి వరకు రూ. 2 కోట్లు.

  • ఎల్‌.ఎన్‌.పేట: ఫాక్సుదొరపేట నుంచి గార్లపాడు వరకు రూ. 2.37 కోట్లు.

  • హిరమండలం : కేఆర్‌ రోడ్డు నుంచి కొమనాపల్లి వరకు రూ. 1.73 కోట్లు.

శ్రీకాకుళం నియోజకవర్గం

  • శ్రీకాకుళం : పాత్రునివలస ఎస్సీ కాలనీ నుంచి నారాయణపురం వరకు రూ. 1.34 కోట్లు. లంకాం నుంచి మాలమన్నయ్యపేట వరకు రూ. 1.28 కోట్లు.

  • గార : సీఎస్‌పీ రోడ్డు నుంచి రాఘవపురం వరకు రూ.1.76 కోట్లు.

టెక్కలి నియోజకవర్గం

  • కోటబొమ్మాళి : ఎన్‌హెచ్‌-16 నుంచి కొత్తపల్లి వరకు (చినసాన మీదుగా) రూ. 3.75 కోట్లు. జేజే రోడ్డు నుంచి పట్టుపురం వరకు రూ. 3.36 కోట్లు.

  • నందిగాం : నౌగాం రోడ్డు నుంచి కందులగూడెం వరకు రూ. 3.34 కోట్లు.

  • సంతబొమ్మాళి : బోరుభద్ర నుంచి డి.మరువాడ వరకు రూ.1.33 కోట్లు.

Updated Date - Dec 11 , 2025 | 12:04 AM