రోటరీ సేవలు ప్రశంసనీయం
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:02 AM
రోటరీ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఇచ్ఛాపురం మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి పి.పరేష్‌కుమార్ అన్నారు.
ఇచ్ఛాపురం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రోటరీ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఇచ్ఛాపురం మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి పి.పరేష్‌కుమార్ అన్నారు. రోటరీ యువజన మాసోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక రోటరీ హాల్లో ఆదివారం నిర్వహించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతాశయాలను ఏర్పరచుకోవాలన్నారు. పోలియో నిర్మూలను అందరూ సహకరించాలన్నారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం న్యాయాధికారి పరేష్‌కుమార్, డా. మోహన్ రౌళోలను సత్కరించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఐ ఎం.చిన్నంనాయిడు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోహన్‌వెంకటేష్, కార్యదర్శి రామకోటి, సభ్యులు బాబీ, సారథి, రాజేష్, త్రినాథ్‌రెడ్డి, జోహార్‌ఖాన్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.