శృంగార, వైరాగ్య కావ్యం ‘కవికర్ణ రసాయనం’
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:55 PM
శృంగార, వైరాగ్య కావ్యం ‘కవికర్ణ రసాయనం’ అని డాక్టర్ బారువ కోమలరావు అన్నారు. నగరం లోని ఉపనిషన్మందిరం ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో నిర్వహి స్తున్న సాహిత్య గణపతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన ప్రసం గించారు.
శ్రీకాకుళం, సెప్టెంబరు 3(ఆంధ్ర జ్యోతి): శృంగార, వైరాగ్య కావ్యం ‘కవికర్ణ రసాయనం’ అని డాక్టర్ బారువ కోమలరావు అన్నారు. నగరం లోని ఉపనిషన్మందిరం ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో నిర్వహి స్తున్న సాహిత్య గణపతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన ప్రసం గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవికర్ణ శ్రీకృష్ణదేవ రాయలు కాలానికి చెందిన వాడన్నారు. ఆయన రచించిన కావ్యంలో అనేక వర్ణనలు ఉన్నాయన్నారు. ఇందులో శృంగారంతో పాటు వైరాగ్యం, భక్తి తదితర అంశాలు ఉన్నా యన్నారు. అనంతరం వక్తను మందిరం ప్రతినిధులు సత్క రించారు. కార్యక్రమంలో జంధ్యాల శరత్ బాబు, మురళీకృష్ణ, సత్యనారాయణ, నారాయణ మూర్తి, నిష్టల నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.