‘ఉపాధి’ నిధులతో రోడ్లకు మోక్షం
ABN , Publish Date - May 04 , 2025 | 11:23 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లోని రహదారులను కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లుగా మార్పు చేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మెహన్‌నాయుడు అన్నారు.
పోలాకి, మే 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లోని రహదారులను కూట మి ప్రభుత్వం సీసీ రోడ్లుగా మార్పు చేసిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మెహన్‌నాయుడు అన్నారు. ఆదివారం దీర్గాశి దుర్గాగిరి అమ్మవారి ఆలయం వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను మంజూరు చేస్తాయని, వివాదాలు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. గతంలో పలు రోడ్లు దారుణంగా ఉండేవని కూటమి ప్రభు త్వం వచిచన తరువాత నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణం చేపడుతోందన్నారు. అం తకు ముందు గ్రామంలోని దుర్గాగిరి అమ్మ వారి జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు రోణంకి కృష్ణంనాయుడు, మిరియబిల్లి వెంకట అప్పలనాయుడు, పల్లి సూరిబాబు, చిట్టి సింహాచం, తర్ర లక్ష్మీనారాయణ, సూరపు నారాయణ దాస్, సర్పంచ్ మెండ కృష్ణసుమంగళి తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు కేంద్రమంత్రికి ఆహ్వానం
నరసన్నపేట, మే 4(ఆంధ్రజ్యోతి): స్థానిక వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 7 నుంచి జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆహ్వానిం చారు. ఈ మేరకు ఆదివారం ఆహ్వాన పత్రికను అందించారు. పది రోజల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త పొట్నూరు చిన్నవీరభద్రస్వామి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు, మావుడూరి జగదీశ్వరబాబు, పొట్నూరు కృష్ణప్రసాద్, జగన్నాథశర్మ పాల్గొన్నారు.