Share News

కూటమి ప్రభుత్వంతో రోడ్లకు మోక్షం: ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:25 AM

రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం హయాంలోనే గ్రామీణ రోడ్లకు మోక్షం కలుగుతోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

కూటమి ప్రభుత్వంతో రోడ్లకు మోక్షం: ఎన్‌ఈఆర్‌
రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

లావేరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం హయాంలోనే గ్రామీణ రోడ్లకు మోక్షం కలుగుతోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం పెద లింగాలవలసలో ‘నమస్తే ఎచ్చెర్ల’ కార్యక్రమం నిర్వహిం చారు. వెంకటాపురం జంక్షన్‌ నుంచి పెదలింగాలవలస మీదుగా పోతాయవలస వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే గ్రామంలో నిర్మించిన 12 సీసీ రోడ్ల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీలో సామాజక భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుం టానన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గ్రామీణ రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. పోతాయవలస నుంచి అదపాక రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మించనున్నా మన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, టీడీపీ మండల అధ్య క్షుడు ముప్పిడి సురేష్‌, బీజేపీ అధ్యక్షుడు లుకలాపు అప్పల నాయుడు, సర్పంచ్‌ లుకలాపు యశోద, కూటమి నాయ కులు ఐ.తోటయ్యదొర, లంక రాంబాబు, మీసాల త్రినాథ్‌, బూటు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 12:25 AM