రహదారులు అభివృద్ధికి చిహ్నాలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:09 AM
రహదారులు అభివృద్ధికి చిహ్నా లు అని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
రూ.3.50కోట్లతో పాత జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన
టెక్కలి, నవంబరు 22(ఆంధ్రజ్యో తి): రహదారులు అభివృద్ధికి చిహ్నా లు అని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. శనివారం జగతిమె ట్ట జంక్షన్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర రెం డు లేన్ల విస్తరణకు గాను రూ.3.50 కోట్లతో జరిగే పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. పట్టణ ప్రాంతాల్లో ర హదారులు విస్తరణతో పాటు డివైడర్ పై మొక్కలు పెంపకం, వాకింగ్ ట్రాక్ వంటి పను లు జరిపించడంతో సుందరీకరణగా ఉంటుంద న్నారు. రహదారి లేని ప్రాంతాలు ఉండకూడదని, తన నియోజకవర్గ పరిధిలో అన్ని రహదారులు పాధ్రాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్టు తెలి పారు. అనంతరం కోటి రూపాయలతో అయ్యప్ప నగర్ నుంచి జాతీయరహదారి వరకు నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే డిగ్రీ కళా శాల ప్రహరీ, ఎన్టీఆర్ క్యాంటీన్, మండాపొలం కా లనీ డ్రైనేజీలు పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయా లని అధికారులకు ఆదేశించారు. జగనన్న కాలనీవా సులు మౌలిక సదుపాయాలు కల్పించాలని మం త్రిని కోరారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కింజరాపు ప్ర సాద్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయ్‌కుమార్, మా ర్కెట్ కమిటీ అధ్యక్షుడు బ గాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్, హనుమంతు రామకృష్ణ, సుందరమ్మ, దమయంతి, లవ, కామేసు, గండి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
రైతులు రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు ప్రా ధాన్యత ఇవ్వాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయు డు అన్నారు. శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యం లో వేరుశనగ విత్తనాలు సబ్సీడీపై అందజేశారు. రాగులు, పెసర, మినుము, కట్టిజనుము వంటి ఆరుతడి పంటలు వేయడం ద్వారా రైతులకు నీటి వనరుల ఇబ్బంది తప్పుతుందన్నారు. ఏవో చిరం జీవి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బగాది శేషగిరి, కింజరాపు ప్రసాద్, పినకాన అజయ్‌కుమార్, లాడి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
కోటబొమ్మాళి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ తన క్యాంపు కార్యాలయంలో ఆయన శని వారం ప్రజాదర్భార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ వినతని అందజేశారు. వచ్చిన వినత పత్రాలను స్వయంగా పరిశీలించి గ్రీవెన్స్ కు హాజరైన అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్ర భుత్వం కృషిచేస్తుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతంద న్నారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.