రోడ్లు ఛిద్రం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:21 AM
మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి.
- మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న రోడ్లు
- ఎక్కడికక్కడే గోతులు
- వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు
- బాగు చేయాలని అధికారులకు విన్నపం
శ్రీకాకుళం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. కోతకు గురై.. గోతులమయమయ్యాయి. అనేక చోట్ల కల్వర్టులు కూడా కుంగిపోయాయి. వంతెనలు మరింత ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గిరిజన రహదారుల పరిస్థితి సరేసరి. రాళ్లు తేలి దారుణంగా తయారయ్యాయి. దీంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. చాలాచోట్ల రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు పాఠశాలలకు చేరుకోలేకపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి మొంథా తుఫాన్ ధాటికి ఛిద్రమైన రహదారులను బాగు చేయించాలని జిల్లావాసులు కోరుతున్నారు.