రోడ్డు పనులు పూర్తిచేయాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:04 AM
రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిరుసువాడకు చెందిన విద్యార్థు లు పోరుబాట పట్టారు.
సిరుసువాడ గ్రామ విద్యార్థుల ఆందోళన
కొత్తూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిరుసువాడకు చెందిన విద్యార్థు లు పోరుబాట పట్టారు. పనులు ఎప్పటికి పూర్తి చేస్తారంటూ శనివారం నిరసన చేపట్టారు. సిరుసువాడ-కుంటిబద్ర రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ ఏడాది మార్చిలో పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, కాంట్రాక్టర్ సగం పనులు చేసి ఆపేశా డు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రహదారి బురదమయంగా మారింద ని, దీనివల్ల కుంటిబద్రలోని హైస్కూల్‌కు సైకిళ్లు, కాలినడకన వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ సిరుసువాడ విద్యార్థులు నిరసనకు దిగారు. కొన్నిచోట్ల రాళ్లు తేలటంతో కాళ్లకు గుచ్చుకుంటున్నాయని, సైకిళ్ల టైర్లకు పంక్చర్లు అవుతున్నాయని వాపోతున్నారు. సిరుసువాడ నుంచి ఇటు కొత్తూరు రావాలన్న ఇదే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.