ప్రతి గ్రామానికి రహదారి: ఎంజీఆర్
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:54 PM
నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారి సదుపాయం కల్పిస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
కొత్తూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారి సదుపాయం కల్పిస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. బుధవారం గొట్ట నివగాం వయా గులుమూరు, కడుము గ్రామాల రహదారి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ హయాంలో రహదారులకు తట్టడి మట్టి కూడా వేయలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవరావు, తులసీవరప్రపాద్ పాల్గొన్నారు