Share News

వైసీపీ నిర్లక్ష్యంతోనే రహదారి కష్టాలు: మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:53 PM

గత వైసీపీ ప్రభుత్వం రహదారులను పట్టించుకోకపోవడం వల్లనే రహదారులు దారుణంగా తయారయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం సంతబొమ్మాళి- కోటబొమ్మాళి రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

 వైసీపీ నిర్లక్ష్యంతోనే రహదారి కష్టాలు: మంత్రి అచ్చెన్న
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి (సంతబొమ్మాళి), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రహదారులను పట్టించుకోకపోవడం వల్లనే రహదారులు దారుణంగా తయారయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం సంతబొమ్మాళి- కోటబొమ్మాళి రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో నూతన రహదారులు నిర్మించకపోగా మరమ్మతులకు గురైన చోట్ల తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తోం దన్నారు. అందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం గ్రామస్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు కూచెట్టి కాంతారావు, నీటి సంఘం అధ్యక్షులు అల్లు రమేష్‌ కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు జీరు భీమారావు, మాజీ జడ్పీటీసీ బాడాన రవణమ్మ, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్‌, నాయకులు మెండ అప్పారావు, సూరాడ ధనరాజు, పుక్కళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నవ్యాంధ్రకు నూతన శకం

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు ఏపీకి పెట్టుబడుల దిశను మార్చే చరిత్రాత్మక వేదికని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. సోమవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ చేపట్టిన వ్యూహాత్మక కృషికి ఈ సదస్సు నిదర్శనమని తెలిపారు. గత ఐదేళ్లలో విధ్వంసకర విధానాలతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రధాన కంపెనీలు తిరిగి ఏపీ వైపు మళ్లుతున్నాయని మంత్రి గుర్తు చేశారు 613 ఒప్పందాల ద్వారా రూ.13.25 లక్షల కో ట్ల పెట్టుబడులు, 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పనకు జరిగిన ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థపై పెట్టుబడుదారుల విశ్వాసాన్ని చాటుతున్నాయని అన్నారు. సదస్సు మొదలు కాకముందే రూ.3.65 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు రావడం, 35 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్రంపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శమని పేర్కొన్నారు. పెట్టుబడులు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా రాయలసీమ, కోస్తాంద్ర, ఉత్తరాంధ్రలలో సమానంగా విస్తరించేలా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.

Updated Date - Nov 17 , 2025 | 11:53 PM