Share News

తీరంపై హక్కు కల్పించాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:24 AM

సముద్రతీరంపై మత్స్య కారులకు హక్కు కల్పిం చాలని ఫిష్‌కాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజా రావు అన్నారు.

తీరంపై హక్కు కల్పించాలి
ఎం.సున్నాపల్లి తీరంలో పూజలు చేస్తున్న మత్స్యకారులు

సంతబొమ్మాళి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సముద్రతీరంపై మత్స్య కారులకు హక్కు కల్పిం చాలని ఫిష్‌కాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజా రావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఎం.సు న్నాపల్లి సముద్ర తీరంలో ప్రపంచ మత్స్య దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముర్రా టలతో ఊరేగింపుగా సముద్రతీరానికి చేరుకుని గంగమ్మకు పూజలు చేశారు. నాయకులు మోహనరావు, నర్సింహమూర్తి, గోవర్దన్‌ పాల్గొన్నారు.

పాతపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకర ఆహారంలో చేపలకు ప్రత్యేకస్థానం ఉంటుందని హెచ్‌ఎం ఎస్‌.వైకుంఠరావు తెలిపా రు. స్థానిక ప్రభుత్వఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయుడు ఎన్‌టీ రామారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మత్స్యదినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చేపల బజారును చూపి క్రయవిక్రయాలపై అవగాహన కల్పించారు.

పోలాకి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని శుక్రవారం గుప్పెడుపేట సాగరతీరంలో మత్స్యకారులు ఘనంగా నిర్వహించారు. గుప్పెడుపేట మత్స్యకార సొసైటీ సభ్యులు, సచివాలయ ఉద్యోగి ఢిల్లీశ్వరరావు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు లండ ఎర్రయ్య, పైడితాత, తులే పైడమ్మ, యువజన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:24 AM