Share News

భిక్షగాళ్లగా తిరిగి.. తాళం వేసిన ఇళ్లను గుర్తించి..

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:19 AM

సోంపేట, బారువ పరిసరాల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ముఠా చంటిపిల్లలతో భిక్షగాళ్లగా తిరిగి తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతోంది.

భిక్షగాళ్లగా తిరిగి.. తాళం వేసిన ఇళ్లను గుర్తించి..

  • దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

సోంపేట, ఆగస్టు 13(ఆంధ్ర జ్యోతి): సోంపేట, బారువ పరిసరాల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ముఠా చంటిపిల్లలతో భిక్షగాళ్లగా తిరిగి తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతోంది. ఈ మేరకు బారువ పోలీసులకు ఆ ముఠా పట్టు బడింది. సీఐ మంగరాజు, బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు కథనం మేరకు.. కొర్లాం గ్రామానికి చెందిన తూగా బాలమ్మ, గార వాణి ఇళ్లకు తాళం వేసి ఉండడంతో జూలై 28న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయం త్రం ఐదు గంటల మధ్యలో కొందరు దొంగతనానికి పాల్పడ్డారు. బాలమ్మ ఇంట్లో అరతులం బంగారం, రూ.7000 కలిపి మొత్తం రూ.30000, వాణి ఇంట్లో ఆర తులం బంగారం చైన్‌, రెండు జతల బంగారు చెవి దిద్దులు, జత సిల్వర్‌ పట్టీలు మొత్తం కలిపి రూ.14000 విలువచేసే వస్తువులు దొంగిలించారు. ఈ మేరకు వారిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో దర్యా ప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన జంక్షన్‌లోని సీసీ కెమెరాలు పరి శీలించారు. బుధవారం ఉదయం పది గంటల సమయంలో బారువ స్టేషన్‌ పరి ధిలోని పాలవలస వద్ద ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి పారిపో యేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించి వారిని పట్టుకొని విచారించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మోనిక సింగ్‌, సోయిదా సింగ్‌గా నిర్ధారించారు. తామే దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు.

Updated Date - Aug 14 , 2025 | 12:19 AM