చెట్టు పైనుంచి పడి రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:52 PM
లుకలాం గ్రామంలో మంగళవారం చింత చెట్టు ఎక్కి బొట్టలు తీస్తూ జారిపడి రిటైర్డ్ ఆర్మీ జవాన్ బొచ్చ శ్రీరాములు (52) మృతిచెందారు.
నరసన్నపేట, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): లుకలాం గ్రామంలో మంగళవారం చింత చెట్టు ఎక్కి బొట్టలు తీస్తూ జారిపడి రిటైర్డ్ ఆర్మీ జవాన్ బొచ్చ శ్రీరాములు (52) మృతిచెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరాములు తన కల్లంలో ఉన్న చింత చెట్టు ఎక్కి బొట్టలు తీసేందుకు చెట్టును దులుపుతున్న సమ యంలో అదుపుతప్పి కింద పడి పోయారు. అయితే భర్త ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో భార్య సూరో డు కల్లానికి వెళ్లి చూసేసరికి చింతచెట్టు కింద పడి ఉన్న శ్రీరాములును చూసి బోరున విలపించింది. స్థానికులు అక్కడికి చేరుకుని శ్రీరాములును సామా జిక ఆసుపత్రికి తరలించగా అప్పటిటే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీ కరించారు. భార్య సూరోడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అసిరినాయుడు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమార్తెకు వివాహం కాగా మరో కుమార్తెకు వివాహం కావాల్సి ఉంది.
చేపల వేటకు వెళ్లి.. వలలో చిక్కుకుని మెట్టక్కివలస మత్స్యకారుడి మృతి
శ్రీకాకుళంక్రెం/ఆమదాలవలస,ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): చెరువులో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలలో చిక్కుకుని నీట మునిగి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ కె.రాము తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆమదాలవలస మండలం మెట్టక్కివలస మండల వీధికి చెందిన గయా బాలు(47) శ్రీకృష్ణ తులసి స్వదేశీయ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యుడిగా పని చేస్తున్నాడు. ఈనెల ఏడో తేదీ రాత్రి 11 గంటల సమయంలో కండ్రవీధికి చెందిన దుదిష్ట బెహర ఆయన కుమారుడు నాగరాజుతో కలిసి కసింవలస చెరువులో చేపలవేటకు వెళ్లాడు. చేపల పడడంతో దుదిష్ట, కుమారుడు చేపలు విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్లారు. తిరిగి వేకువజామున ఐదు గంటలకు చెరువు దగ్గరకు వచ్చి బాలుని పిలిచిన పలుకలేదు. ఇంతలో చెరువులో ఎవరో తేలుతు కని పించడంతో వెళ్లి పరిశీలించారు. కాలికి వల చుట్టుకుని నీటిలో తేలుతూ బాలు కనిపించాడు. దీంతో ఆయన భార్య పద్మకు ఫోన్ చేసి విషయాన్ని దుదిష్ట తెలియజేశాడు. దీంతో పద్మ కుటుంబ సభ్యులు, మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులకు విషయం తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంగళవారం రూరల్ పోలీసులకు పద్మ ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రాము అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృత దేహానికి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో హోంగార్డు..
సరుబుజ్జిలి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): చిగురు వలస గ్రామానికి చెందిన హోంగార్డు నల్లాన సింహాచలం (40) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు.. హైదరాబాద్‌లో సిం హాచలం 15 ఏళ్లుగా హోంగార్డుగా విధులు నిర్వహి స్తున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లోని మియా పూర్ జంక్షన్ వద్ద పోలీస్ అంబ్రెల్లాను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా స్థాని కులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు. విషయం తెలి యడంతో చిగురువలసలో విషాదఛాయలు అలముకున్నాయి. సింహాచలం తండ్రి త్రినాఽథరావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు సింహాచలానికి తల్లితో పాటు భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మియాపూర్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాన్ని తర లించారు. మృతదేహానికి చిగురువలసలో బుధవారం అంత్యక్రియలు నిర్వ హించేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రైలు ఢీకొని ఒకరు..
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొన్న సంఘటనలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇచ్ఛాపురం వద్ద పీర్లకొండ సమీపంలో గల రైలు ట్రాక్ వద్ద 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు.ఈ మేరకు పలా స జీఆర్పీ పోలీసులకు సమాచారం తెలియజేశారు. పలాస జీఆర్పీ కాని స్టేబుల్ డి.హరినాఽథ్ కేసు నమోదు చేశారు.