Share News

సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించండి

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:56 PM

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణం విచారించి పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించండి
వినతిని పరిశీలిస్తున్న ఎస్పీ

పలాస, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణం విచారించి పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవా రం కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ప్ర జాఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వ హించి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ స్వీకరించే ఆర్జీలను పరిష్క రించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. పలాస, టెక్కలి డివిజన్‌ల పరిధిలో ఫిర్యాదుదారుల సౌకర్యం కోసం కాశీబుగ్గలో ప్రతి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నామని, దీన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో హౌస్‌ అధికారులతో మాట్లాడారు. కేసుల పెండింగ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో డీఎస్పీ వి.వెంకట అప్పారావు, సీఐలు పి.సూర్యనారాయణ, తిరుపతిరావుతో పాటు డివిజన్‌లో ఉన్న సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:56 PM