అర్జీదారుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:37 PM
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారు లను ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం గ్రీవెన్స్ నిర్వహించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
అరసవల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారు లను ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో మా ట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వినతులను స్వీకరించారు. వ్యక్తి గతంగా అర్జీలు స్వీకరించి వాటికి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధి కారులకు ఫోన్ చేసి పరిష్కారాలను సూచించారు. పలువురు దివ్యాం గులు కేంద్ర మంత్రిని కలిసి వినతులు ఇచ్చేందుకు రాగా వారి వద్దకే ఆయన వెళ్లి సమస్యలు అడిగి తెలుసు కున్నారు.
సామాజిక భవనం మంజూరు చేయండి
ఇచ్ఛాపురం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాఫురం మండలం కీర్తిపురం పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్క రించాలని గ్రామ స్థులు కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళంలో క్యాంపు కార్యాలయంలో కలి సి వినతిపత్రం అందించారు. గ్రామంలో సామాజిక భవన నిర్మించాలని, శ్మశాన వాటికలో షెడ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మ నాభం, కార్య దర్శి డి.కామేష్, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, గిన్ని బాలరాజు, నరహరి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కమిషన్ సభ్యుడికి అభినందన
రణస్థలం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యు డిగా నియమితులైన ముక్క ఆదినారాయణను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అభినందించారు. ఆదివారం శ్రీకాకుళంలోని క్యాం పు కార్యాలయంలో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.