కిడ్నీ వ్యాధిపై అన్వేషణ
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:33 AM
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించ డానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
- రంగంలోకి దిగిన ఐసీఎంఆర్
- ఉద్దానంలో పరిశోధనకు ఆమోదం
- మూడు దశల్లో రూ.6.2 కోట్ల విడుదలకు అంగీకారం
పలాస, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించ డానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం మూడేళ్ల పాటు ఉద్దాన ప్రాం తంలో పరిశోధనలు చేయడానికి ఐసీఎంఆర్ (ఇండి యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ప్రకటించా రు. దీనికోసం మొత్తం మూడు దశల్లో రూ.6.2 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఐసీఎంఆర్ అంగీక రించింది. దీంతో ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాలపై అన్వేషణ పూర్తిస్థా యిలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిపై విదేశీ నిపుణుల బృందం పరిశోధనలు చేస్తోంది. జార్జ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు ఇప్పటికే తమ బృందాల ద్వారా పరిశోధనలు చేయడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా ఐసీఎంఆర్ కూడా రంగంలోకి దిగడంతో కిడ్నీ వ్యాధి మూలాలు పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ బృందం ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఆయన మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏయు వైద్య కళాశాల నెఫ్రాలజిస్ట్ ఫ్రొఫసర్ ప్రసాద్‌తో కూడిన వైద్య బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక ప్రతిపాదనలు పంపించింది. కిడ్నీ వ్యాధుల మూలాలపై గతంలో మొత్తం లక్షకు పైగా శ్యాంపిల్స్ సేకరించారు. అందులో 25వేల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతు న్నట్లు గుర్తించి వారికి ప్రభుత్వం అత్యవసర చికిత్స అందిస్తుంది. ప్రస్తుతం ఐసీఎంఆర్ ప్రతిపాదనలతో ర్యాండమ్ తనిఖీలు నిర్వహించి తొలివిడతగా 5,500 మందిని ఎంపిక చేసి వారి రక్త, మూత్రం సేకరించి ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షి స్తారు. పలాస 200 పడకల ఆసుపత్రిలో, కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఇప్పటికే అనేక మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తున్నారు. అందులోనే వ్యాధి మూలాలను కనుగొనేందుకు ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.