Share News

నిర్ణీత గడువులో వినతులకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:53 PM

: ప్రజా ఫిర్యా దుల స్వీకరణ, పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

 నిర్ణీత గడువులో వినతులకు పరిష్కారం చూపాలి
జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యా దుల స్వీకరణ, పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీ సు కార్యాలయం నుంచి మంగళవారం సబ్‌ డివిజన్‌, సర్కిల్‌, స్టేషన్‌స్థాయి అధికారులతో జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని పట్ల మర్యాదపూర్వకంగా వ్యవ హరించాలన్నారు. స్టేషన్‌లో పెడింగ్‌లో ఉన్న ముఖ్య మైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధి తులకు న్యా యం చేయాలన్నారు. మొబైల్‌ ఫోన్‌ చోరీ, పోగొట్టుకున్న సంద ర్భాల్లో సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి త్వరితగతిన ట్రేసవుట్‌ చేసి వారికి అప్పగించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, డీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:53 PM