Share News

సమస్యలపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:58 PM

సమస్యలపై నివేదిక ఇవ్వాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి కోరారు. శనివారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారమార్గాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో నిర్వహించారు.

     సమస్యలపై నివేదిక ఇవ్వండి
మాట్లాడుతున్న వెంకన్నచౌదరి:

పలాస, ఏప్రిల్‌ 19(ఆంరఽధజ్యోతి):సమస్యలపై నివేదిక ఇవ్వాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి కోరారు. శనివారం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారమార్గాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో నిర్వహించారు. ఈసందర్భంగా వెంకన్నచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనకంటే ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, విద్యాలయాలు, ఆసుపత్రుల ఆధునికీకరణ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల నిర్వహణ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చర్చించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు, మునిసిపాలిటీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:58 PM