ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:37 PM
రహదారికి ఇరువైపులా ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రహదారికి ఇరువైపులా ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చ రించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు ఫుట్‌పాత్, రోడ్ల పై ఏర్పాటు చేసిన పలు దుకాణాలను నగర పాలక సంస్థ సిబ్బందితో కలిసి మంగళవారం తొలగించారు. ఫుట్ పాత్‌లపై ఏర్పాటు చేసిన దుకాణాలకు సంబంధించిన బోర్డులను, వస్తువులను వాహనంలోకి ఎక్కించారు. ఆయన మాట్లా డుతూ.. ఫుట్‌పాత్‌లపై, రోడ్లపైగాని దుకా ణాలు ఏర్పాటు చేయరాదని, ప్రజలు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారని, వాటిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు.