పొంగుతున్న రెల్లి గెడ్డ
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:58 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెల్లిగెడ్డలో వరదనీరు లైదాం బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహి స్తోంది. బ్రిడ్జిపై 3 అడుగులమేర వరదనీరు ప్రవహించడంతో పొందూరు, సంతకవిటి మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జి.సిగడాం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జి.సిగడాం మండలం టీడీవలస, విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామాల మధ్య ఉన్న రెల్లిగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు మండలాల ప్రజలు రాకపోక లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి నీరు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మర్రివలస గ్రామంలో చెరువు గట్టుకు పాక్షికంగా గండిపడింది.
లైదాం బ్రిడ్జిపై నిలిచిన రాకపోకలు
పొందూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెల్లిగెడ్డలో వరదనీరు లైదాం బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహి స్తోంది. బ్రిడ్జిపై 3 అడుగులమేర వరదనీరు ప్రవహించడంతో పొందూరు, సంతకవిటి మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెల్లిగెడ్డ పరిధిలో పంటపొలాల్లో వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలుల తీవ్రతకు మండలంలో 23 విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. జోగన్నపేటలో ప్రధాన విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. తోలాపి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోకి సుబ్బయ్య చెరువు నుంచి నీరు చేరింది. పొందూరు నుంచి కాలనీకి వెళ్లే దారిలో గెడ్డ ఉధృతంగా ప్రవ హించడంతో కాలనీ వాసు లు రాకపోకలు ఇబ్బందులు పడ్డారు. తోలాపి ఎస్సీ కాలనీలో భారీగా వరదనీరు నిలిచి పోవ డంతో కాలనీవాసులు కష్టాలు పడ్డారు.
గెడ్డ ఉధృతితో నిలిచిన రాకపోకలు
లావేరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గడచిన మూడు రోజులుగా కురు స్తున్న భారీ వర్షాలకు వర ద నీటితో బుడు మూరు పెద్దగెడ్డ ఉధృతంగా ప్రవ హించింది. దీంతో అద పాక-గుర్రాల పాలెం మధ్యలో కాజ్‌వే పైనుంచి నీటి ప్రవాహంతో గుర్రాలపాలెం, పాత కుంకాం, కొత్త కుంకాం, పైడాయ వలస, ఇజ్జుపేట, ఎల్‌ఎన్‌పురం, పెద కొత్తపల్లి, కందిపేట తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. వరద నీటివల్ల అదపాక పెద్దగెడ్డ వద్ద ఉన్న బీటీ రోడ్డు బీటలు వారింది. దీంతో గెడ్డ ప్రవాహం తగ్గినా సరే ఈ మార్గంలో ప్రయా ణం చేయడం కష్టతరంగా మారింది. కోతకు గురైన రహదారిని బుధవారం అధికారులు వెంటనే ఎక్స్‌కవేటర్ సాయంతో మదుములకు అడ్డంగా ఉన్న తుప్పలను తొలగించి గ్రావెల్ వేచి తాత్కాలికంగా మరమ్మతులు చేప ట్టారు. మండలంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వర్షాలకుగా చిగురుకొత్తపల్లిలో బావరాజు అప్పా రావు ఇంటికి ఆనుకుని ఓ చెట్టుకూలి పడిపోయింది. అయితే ఎటువంటి ప్రమాదం జర గలేదు. తహసీల్దార్ శ్రీనివాస రావు, ఎస్‌ఐ లక్ష్మణరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో పద్మజ వెంటనే స్పందించి చెట్టును తొలగించే చర్యలు తీసుకున్నారు.