రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:40 PM
:పెండింగ్‌లో ఉన్న రూ.4200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఏఐఎస్‌ఎఫ్‌జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి డిమాండ్ చేశారు. బుధవారం పలాస తహసీల్దార్‌కార్యాలయం ఆవరణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని నిరసన తెలిపారు.
పలాస రూరల్, జూలై9 (ఆంధ్రజ్యోతి):పెండింగ్‌లో ఉన్న రూ.4200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఏఐఎస్‌ఎఫ్‌జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి డిమాండ్ చేశారు. బుధవారం పలాస తహసీల్దార్‌కార్యాలయం ఆవరణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని నిరసన తెలిపారు.ఈ సంద ర్భంగా సందర్భంగా మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండడంతో బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. జీవో-77ను రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రని, నిలిచిన పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కళ్యాణచక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సాయి, జిల్లా సహాయకార్యదర్శి హరికృష్ణ, సమితి సభ్యులు సోమేశ్,రాహుల్ పాల్గొన్నారు.