Share News

భూ ఆక్రమణ దారులపై కేసులు నమోదు చేయండి

ABN , Publish Date - May 18 , 2025 | 12:09 AM

ప్రభుత్వ భూములు, చెరువు, గెడ్డపోరంబోకు స్థలాలు ఆక్రమించినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌ ను ఆదేశించారు.

భూ ఆక్రమణ దారులపై కేసులు నమోదు చేయండి
అధికారులకు సూచనలిస్తున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

  • జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

పొందూరు, మే 17(ఆంద్రజ్యోతి): ప్రభుత్వ భూములు, చెరువు, గెడ్డపోరంబోకు స్థలాలు ఆక్రమించినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌ ను ఆదేశించారు. తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామ పరిధిలో వీరమరణం పొందిన జవాన్‌ సింగూరు విష్ణు మూర్తి కుటుంబానికి కేటాయిస్తున్న స్థలాన్ని పరిశీ లించారు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో భాగంగా తోలాపి గ్రా మానికి చెందిన సింగూరు విష్ణుమూర్తి భార్య శాంతకు తోలాపిలో 2.5 ఎకరాల స్థలం కేటాయించారు. అయితే చె రువు గర్భంలో భూమి కేటాయించడంతో 2022లో దీనిని రద్దు చేశారు. తనకు భూమి కేటాయించాలని సింగూరు శాంత ఉన్నతాధికారులకు వినతి అందించడంతో సెక్రటేరియట్‌ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో బొట్లపేట పరిధిలో స్థలపరిశీలన చేశారు. తక్షణమే పట్టా, పాస్‌బుక్‌లు సిద్దం చేయాలని తహసీల్దార్‌కు సూచించారు.

Updated Date - May 18 , 2025 | 12:09 AM