Share News

తగ్గించిన ధరల బోర్డులు ప్రదర్శించాలి

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:11 AM

కేంద్ర ప్రభుత్వం వ్యాపారంలో విప్లవా త్మక మార్పులు తీసుకువచ్చిందని, ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ విధానాన్ని జీఎస్‌టీ 2.0 పేరుతో మొత్తం పన్నులు తగ్గించిదని, దీన్ని వ్యాపారులు తక్షణం అమలు చేయడంతో పాటు తగ్గిన ధరలు, పాత ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని పలాస జీఎస్‌టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.నాగరాజు కోరారు.

తగ్గించిన ధరల బోర్డులు ప్రదర్శించాలి
మాట్లాడుతున్న జీఎస్‌టీ ఏసీ నాగరాజు

పలాస, సెప్టెంబ రు 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వ్యాపారంలో విప్లవా త్మక మార్పులు తీసుకువచ్చిందని, ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ విధానాన్ని జీఎస్‌టీ 2.0 పేరుతో మొత్తం పన్నులు తగ్గించిదని, దీన్ని వ్యాపారులు తక్షణం అమలు చేయడంతో పాటు తగ్గిన ధరలు, పాత ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని పలాస జీఎస్‌టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.నాగరాజు కోరారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం(పీసీఎంఏ) భవనంలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణ వ్యాపారులు, ట్రేడ్‌ లైసెన్స్‌దారులతో అవగాహన కార్యక్రమాన్ని జీఎస్‌టీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పీసీఎంఏ అధ్యక్షు డు మల్లా శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిఽథిగా పాల్గొ న్న ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యాపారి ఫైనాన్స్‌ అవగాహన కలిగి ఉండాల న్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సూపర్‌ జీఎస్‌టీ సూపర్‌ సేవింగ్‌ను అందిపుచ్చు కొని ఖాతాదారులకు నిర్దేశించిన ధరలకు విక్రయాలు చేపట్టాలని పిలుపునిచ్చా రు. పీసీఎంఏ ప్రధాన కార్యదర్శి టంకాల రవిశంకర్‌గుప్తా, కోశాధికారి మల్లా సంతోష్‌, పారిశ్రామికవాడ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, వ్యాపారులు మల్లా భాస్కరరావు, సిందిరి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:11 AM