జిల్లాలో విస్తృతంగా రెడ్‌క్రాస్ సేవలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:25 AM
రెడ్‌క్రాస్ ద్వారా జిల్లాలో విస్తృత సేవలు అందిస్తున్నట్టు కలెక్టర్ సప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): రెడ్‌క్రాస్ ద్వారా జిల్లాలో విస్తృత సేవలు అందిస్తున్నట్టు కలెక్టర్ సప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన రెడ్‌క్రాస్ స ర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితుల కు తమవంతు అండగా నిలుస్తుందన్నారు. ఏడాది పొడ వునా రక్తదాన శిబిరాలు నిర్వహించి వేలాది మంది ప్రా ణాలను కాపడుతుందన్నారు. జిల్లాలో 28 మందికి తల సేమియా బాధితులకు రక్తం అందిస్తుండడం అభినంద నీయమన్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌కు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉందన్నారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహ నరావు మాట్లాడుతూ.. జిల్లా రెడ్‌క్రాస్ అందించిన సేవ లకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కిందని, ఈ అవార్డును వచ్చే నెల 9న విజయవాడలో గవర్నర్ నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందుకుంటారన్నారు. గతే డాది రెడ్‌క్రాస్ ద్వారా అందించిన సేవలను ఈ సం దర్భంగా వివరించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడ గానికి సహాయ, సహకారాలు అందించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులను స త్కరించారు. తొలుత రెడ్‌క్రాస్ వ్య వస్థాపకుడు హెన్రీ డునాంట్ చి త్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఏడాదిలో చేపట్టిన కా ర్యక్రమాల బ్రోచర్‌ను ఆవిష్కరిం చారు. ఉపాధ్యక్షుడు కె.సుధీర్, ట్రె జరర్ కె.దుర్గారావు, ఏజీఎం పరి శీలకులు ఎం.శ్రీరాములు, ప్రతిని ధులు పెంకి చైతన్యకుమార్, కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
రణస్థలం: గతేడాది అక్టో బరు 2న గాంధీ జయంతిని పురష్కరించుకుని మహాలక్ష్మి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం తో ఆ క్లబ్ అధ్యక్షుడు నడుకుదిటి తేజాబాబును కలెక్టర్ అభినందించారు. ఉత్తమ సేవలు అందించిన తేజాబా బుకు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఆమదాలవలస: పట్టణంలోని పూజారిపేటలో ఉన్న కృతిక్ ఫౌండేషన్స్ సంస్థ అందిస్తున్న సేవలకు రెడ్‌క్రాస్ అవార్డు దక్కింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు చిగురుపల్లి వెంకటేష్ ప్రశంసాపత్రం, అవార్డు రెడ్‌క్రాస్ ప్రతినిధుల నుంచి అందుకున్నారు.