Share News

చారిత్రక కట్టడంగా గుర్తించండి

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:06 AM

కళింగపట్నంలో గ్రామ సచివాలయం పక్కనే ఉన్న బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని చారిత్రక కట్టడంగా గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.

చారిత్రక కట్టడంగా గుర్తించండి
శిథిలావస్థకు చేరిన బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన భవనం

  • బ్రిటిష్‌ కాలంలో ఖజానా కార్యాలయంగా..

  • స్వాతంత్య్రం తర్వాత పశువైద్యశాలగా..

  • ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనం

గార, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): కళింగపట్నంలో గ్రామ సచివాలయం పక్కనే ఉన్న బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఈ భవనాన్ని చారిత్రక కట్టడంగా గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఈ భవనం అప్పట్లో ఈ ప్రాంతానికి ఖజానా కార్యాలయంగా వినియోగించేవారిని స్థానిక పెద్దలు చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం పశువైద్యశాలగా ఉపయోగించారు. దశబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు ఊడిపోవడం, గోడలు బీటలు వారిపోయాయి. దీనిని చారిత్రక కట్టడంగా ప్రభుత్వం గుర్తించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై జిల్లా పర్యాటక శాఖ అధికారి మాట్లాడుతూ.. కళింగపట్నంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన పశువుల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:06 AM