Share News

చేసిన సేవలతోనే పార్టీలో గుర్తింపు

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:10 AM

పార్టీకి చేసినసేవలకు తగిన గుర్తింపు లభిస్తుం దని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

చేసిన సేవలతోనే పార్టీలో గుర్తింపు
ప్రమాణస్వీకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పార్టీ పరిశీలకులు త్రినాథరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పార్టీకి చేసినసేవలకు తగిన గుర్తింపు లభిస్తుం దని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక కేఎస్‌ఎం ప్లాజాలో టీడీపీ మండల క మిటీ, బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ అనుబంధ కమి టీల ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకు లు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళు లర్పించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రజా అ వసరాలే సేవే లక్ష్యాలుగా ప నిచేయాలని తెలిపారు. పార్టీ సి ద్ధాంతాలకు అనుగుణంగా నాయకత్వంపై నిబద్ధత కలిగి ఉండాలన్నారు. నియోజకవర్గ పరి ధిలోని బూత్‌, క్లస్టర్‌, యూనిట్‌ ఇ న్‌చార్జీలతోపాటు అనుబంధ శాఖలు, అలాగే పాతపట్నం మండల పార్టీ శాఖతోపాటు పాత పట్నం, కొత్తూరు, హిరమండలం పట్టణ క మిటీల ప్రమాణస్వీకారం నిర్వ హించారు. పార్టీ ప రిశీలకులు డి.త్రినాఽథరావు పర్యవేక్షణలో జరి గిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధి లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:10 AM