పనిచేసే కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:18 AM
టీడీపీలో పనిచేసే కార్యకర్తకు భవిష్యత్‌లో మంచి గుర్తింపు ఉంటుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
లావేరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీలో పనిచేసే కార్యకర్తకు భవిష్యత్‌లో మంచి గుర్తింపు ఉంటుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం బెజ్జిపురంలో పార్టీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్ అధ్యక్షతన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలిశెట్టి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచే అభ్యుర్థుల విజయానికి పాటుపడాలన్నా రు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదంతో పార్టీ పురోభివృద్ధి లో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజ లకు అవగాహన కలిగించాలన్నారు. కార్యక్రమంలో టీడీడీ జిల్లా మాజీ అఽధ్యక్షుడు చౌదరి నారా యణమూర్తి, జి.సిగడాం టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కె.దామోదర రావు, టీడీపీ నేతలు నిడిగంట్ల త్రినాథ్, ఐ.తోటయ్యదొర, పిన్నింటి మధుబాబు, లంక నారాయణ రావు, దన్నాన శ్రీనివాసరావు, సర్పంచ్ ఆరెళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.