కష్టకాలంలో పనిచేసే వారికి గుర్తింపు
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:23 PM
కష్టకాలంలో పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం త్రిసభ్యకమిటీ సమావేశం జరిగింది.
పాతపట్నం, సెప్టెంబరు2(ఆంధ్రజ్యోతి): కష్టకాలంలో పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం త్రిసభ్యకమిటీ సమావేశం జరిగింది. టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ ప్రధానకమిటీ, అనుబంధ కమిటీల్లో నామినేటెడ్ పదవులు భర్తీకోసం అధిష్ఠానం త్రిసభ్య కమిటీ నియమించిన విషయం విదితమే. సమావేశంలో కమిటీసభ్యుల్లు ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధానక్యాదర్శి మహమ్మద్ నజీర్, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి, కలగ జగదీష్, దాసునాయుడు, నాగళ్ల అప్పన్న పాల్గొన్నారు.