Share News

విద్యార్థి దశలోనే పఠనాశక్తి పెంచాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:50 PM

విద్యార్థి దశనుంచే ఆటపాటలతోపాటు పుస్తకపఠనాశక్తిని పెంచాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో గంఽథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గ్రంధాలయ ఉద్యమంలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నా

విద్యార్థి దశలోనే పఠనాశక్తి పెంచాలి
టెక్కలి: శాఖాగ్రంథాలయంలో అయ్యంకి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న గ్రంథాలయాధికారి రూపావతి, పాఠకులు:

విద్యార్థి దశనుంచే ఆటపాటలతోపాటు పుస్తకపఠనాశక్తిని పెంచాలని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో గంఽథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గ్రంధాలయ ఉద్యమంలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఫకోటబొమ్మాళి, జూలై 24 (ఆంఽధజ్యోతి): కోటబొమ్మాళి శాఖాగ్రంథాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం వెంకటరమణ పూలమాలలు వేసి నివాళు లర్పించారు.కార్యక్రమంలో గ్రంథాలయాధికారి రామకృష్ణఉపాధ్యాయులు దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

ఫటెక్కలి, జూలై 24(ఆంధ్రజ్యోతి): స్థానిక శాఖాగ్రంథాలయంలో అయ్యంకి వెంకటరమణ చిత్ర పటానికి గ్రంథపాలకురాలు బి.రూపావతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫపాతపట్నం, జూలై24(ఆంధ్రజ్యోతి):స్థానికశాఖాగ్రంథాలయంలో విశ్రాంత శాఖాగ్రంథాలయాధి కారి కాళ్లరాజు, గంఽథాలయాధికారి జి.సాయమ్మ అయ్యంకి వెంకటరమణయ్య జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో పి.రామరాజు, దుర్గారావు భోగేశ్వరరావు ప్రవీణ్‌ శంకర్‌ వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:50 PM